Friday, December 28, 2012

నేటి సంఘంలో నువ్వు


పూలదారులు మరిచిపోయిన బాటసారి ని దారి యేది? 

బరువు బరువనుకోనేడి బ్రతుకు పరుగులో నీ స్తనమేది? 

విర్రవీగిన వెర్రి మనుషుల పిచ్చికేకలకర్ధమై నేటి సంఘం నిలువగా అందులో ని పాత్ర ఏది? 

పశువు మేలయ నీతో పోల్చితే పచ్చికే పరమార్ధము 

నీకు వాంఛల వెల్లువమ్మొ నిలువాదే మది నిమిషము 

నిన్న నీచము నీకు ఆ పని నేడు నీకది ధర్మమా?

పద్దతులు పదివేలు ఉన్నవి రోజుకొక్కటి సొంతమ?

ఏమిటో ఈ వైపరీత్యం ! విరుగుడే మరి వెతకవు 

సంస్థలెన్నో పుట్టుకొచ్చే ఇవి పురోగాతులని పలుకుతూ 

సంస్కృతేమొ సగము చచ్చే తనకు స్తనం వెతుకుతూ !



Thursday, December 13, 2012

వెలుగే కొత్తగా వాళ్ళో వాలగా వెలిగిందీక్షణం వెలుతురు సాక్షిగా

వెలుగే కొత్తగా వాళ్ళో వాలగా వెలిగిందీక్షణం వెలుతురు సాక్షిగా 
కలలే ఇంతగా కాననే లేదుగా నీ కౌగిలి పరిచయం ఓ కమ్మని పరిమళం 

పెదవుల వెనకే పలుకే ఆగె 
పదే పదే నీకై మనసే లాగె 
కల నిజమయ్యింద కధ మొదలయ్యింద 
కలిసిన మనసుల కధ కనులకు తెలిసిందా 

వెలుగే కొత్తగా వాళ్ళో వాలగా వెలిగిందీక్షణం వెలుతురు సాక్షిగా 
కలలే ఇంతగా కాననే లేదుగా నీ కౌగిలి పరిచయం ఓ కమ్మని పరిమళం 

ఉందొ లేదో నికే ప్రేమే మదిలో 
సవ్వడి నువ్వయ్యవే న హృది లో  యద లో 
నమ్మాలో లేదు నిన్ను అని నమ్మకమదిగితే నన్ను ఏమనను 
నమ్మకమే ఒదిలిన నిన్ను నిత్యం నీతో ఉంటాను నిన్ను ఒదిలి పోను 

వెలుగే కొత్తగా వాళ్ళో వాలగా వెలిగిందీక్షణం వెలుతురు సాక్షిగా 
కలలే ఇంతగా కాననే లేదుగా నీ కౌగిలి పరిచయం ఓ కమ్మని పరిమళం 

Monday, November 5, 2012


మనసుపడిన కాంత కోసం మనసు చేసే నిరీక్షణ 
అర్ధం అవదావనితకేమో ఆశ లో ఆవేదన 

భావాలకు కళ్ళెం వేసి పరుగాపితే ప్రియతమా 
అది ఆగి అరిచే ఆస్వామ ? ని ఆశ అంతటి అల్పమా ?
ఆపగ అది ఆపగ ఆగదు, ఆశ  అన్నది వివేకమేరుగదు 

శీలమన్నది సొత్తు కాదు - సిగ్గు అలమర దాచలేదు 
సమర్పణ అనే అగరుపోగల సువసనే శీలము 
సంయోగ భోగ యోగమే విశ్వము 

మనసుకో తాళం, ఆశ కో అవధి , ఆనందానికో ఆనకట్ట , జీవితానికో భగవంతుని రాత !
అనే భ్రమ లో బంధించడానికే  బంధాలనే రోత !
పగలగొడితే మనసు తాళం , దాటిపోతే ఆశ అవధి , కట్ట తెంచిన ఆనందపు వరద తిరగారాస్తాయి జన్మ రాత !

రక్కలు విప్పిన పక్షిని అడుగు స్వతంత్రం అర్ధం ఏంటో !
గర్జించే సింహన్నడుగు తెగింపు తీరం దూరం ఎంతో !

ఆత్మా సాక్షిని ఆర్తిగా అడుగు ఆదర్శం అర్ధం ఏంటో!

Friday, October 26, 2012

ఒంటరితనం ఒక అందమైన తీరం !!!





ఒంటరితనం ఒక అందమైన తీరం 
తెల్లారని ఏకాంతం నల్లని చీరను కట్టిన మోహిని అవతారం 
వెలకట్టలేని భావాలను తులనాడలేని  బంధాలను పోగేసి చేసిన  ఇసుక  తిన్నెల పర్వత రూపం 
జ్ఞాపకాలనే కెరటాల తాకిడి, అనుభవాలనే తడి, 
ఆవేదన అనే నురుగు, ఆలోచన ధ్వని!
మెరిసే తారలు మిగిలిన మిత్రులు 
చమక్కుల పలకరింపులు గుర్తుచేసిన జ్ఞాపకాలు 
అదిగో మల్లి తగిలిన కెరటాలు 

ఒంటరితనం ఒక అందమైన తీరం !!!

భయమేమో బతుకు సత్యం అని నేర్పిన గురువు ఏకాంతం 
ప్రేమల పిల్ల గాలి పిలిచిన వైనం - గమ్యం సూన్యమని లాగేసిన ఇసుక సైన్యం 

ఒంటరితనం ఒక అందమైన తీరం !!!

బాధ కన్నా బాధ్యతగల భావం ఇంకోటి లేదు 
బాధ లో పుట్టేదే భావోద్వేగం 
భావుకతలో జన్మనెత్తేదే  భావ కవిత్వం !!!

ఒంటరితనం ఒక అందమైన తీరం !!!

Saturday, October 20, 2012

మరువాన మైదానం


మూతపడిన ముల్లోకాలు, మోతలాపని మన శోకాలు!!!
ఎన్నో ప్రశ్నలకి జన్మనిస్తున్న! సమాధానాలు అన్వేషిస్తున్న! 
అలసి అలసి ఆగిపోతున్న ఆశ బతకాలని తాగిపోతున్న 

మరువాన మరువాన మరువాన మరువాన....
నాతో  నేను - నాలో నేను - నాకై నేను - నన్నే నేను
రమిస్తూ - శ్రమిస్తూ - తపిస్తూ - శపిస్తున్న!
అర్ధాలు వెతకాలని తాగేస్తున్నా  

మరువాన మరువాన మరువాన మరువాన....

దిక్కులు చూపని ఆ దిక్కు వెలుతురూ ఎరుగని ఆ తళ్ళుక్కు 
వెతకని చోటే లేకుండా నే వెతికేస్తున్న 
సమాధానం దొరకలేదనే నే తాగుతున్న  
మరువాన!

ప్రకృతిని, పక్షులని, పనిమాల పలకరిస్తున్న 
పలకలెదని అలిగి కూర్చున్న 
అంద్దుకే నే తాగుతున్న 
మరువాన!

పాతాళం కన్నా లోతంట!
ఆకాశం దాటినా అందడంట!!
అది ఏంటో వెతుకుతున్న 
తెలుస్తుందేమో అని కాలుస్తున్న!!!
అందుకే నే పీలుస్తున్న!!!


ఒక్క సారి ప్రశాంతంగా ఏకాంతంలో కలుసుకుందాం

ఒక్క సారి ప్రశాంతంగా ఏకాంతంలో కలుసుకుందాం 

బంధాలు బాధ్యతల బట్టలు తీసి, అందాలూ ఆనందాల దుప్పటి లో  జారుకుందాం  
ఆశలు ఆవేశాల అగరుపోగాలు, శ్వాసలు స్వేదాల మేళనం లో ముగ్ధమవ్వ్దాం 
కట్టుబాట్ల శరీరాలు కట్టెలో కాల్చి 
ఆరని ఆ అగ్నికి ఆవిరైన ఆత్మా ఆదర్శాన్ని,  మన స్వాతంత్ర్యాన్ని ఆ కొన్ని క్షణాలు ఆనందిద్దాం 

ఒక్క సారి ప్రశాంతంగా ఏకాంతంలో కలుసుకుందాం 


Thursday, October 18, 2012

Neecham


  • రమ్మన్న రాని రేపుకు  దూరపు చుట్టం నిట్టుర్పు 

  • దేహం దాహం తీర్చిన తీర్ధం ఆత్మాను ఆకలికోదిలిన వైనం
  •  
  • చైతన్యం చలరేగితే సూన్యం 

  • చల్లారిన నెత్తుటిలో కలిసిన స్వేదం 
  •  
  • విలువలు అన్ని వలువలు కాగ వ్యక్తిత్వం ఒక వేషం అవగా 

  • వ్యర్ధం నిస్వార్ధం వెనకటి మాటే ఆశావాదం

  • నీచం నీచం దానికన్నా నీచం కింద ఇంకా నీచం ఆ కింద నీచం ఇంకొంచం నీచం 

  • నిచ్చన వేసుకు దిగజారిన మానుషం  

Friday, June 15, 2012

9th, June, 2012


9th, June, 2012

A lazy Sunday, that was extremely sunny. woke up around 11 came out of my house for a smoke... called her and she started throwing tantrums around me, i was annoyed and annoyed out of fact that i love her so much. She was perpetually rejecting me, Oh! god! i never believed that i can accept rejection in my life so calmly. disgusting truths i hate truth...then all of a sudden in the middle of an interesting Indian Idol episode i got a call, a friend who was I dont know where she was then said that i am back in hyderabad. Was happy that she is back in town, but again she took a promise from me...(these girls and their filmy promises) that nothing's gonna the way it was before, she claims herself to be a matured girl, what crap! and then she hung up. By now I was getting bored of my own life called a friend to meet at lamakaan... it an open cultural space. it was written on the notice board, Director Gautham Ghosh movie screening at 6 30 pm today. Wow! interesting shit! then, I learn that Gautham Ghosh was actually there for the screening! I mean the Gautham  Ghosh man!!!

Oh god had a wonderful chat with Sir, I realized what was missing in me. Kill for the thing u want to do in life! this was missing and with his amazing talk, i am back to my senses now.

Friday, June 1, 2012

చక్రం

కాలం కదిలి పోతుంది ,

కాష్టం కడలి లో కలిసి పోతుంది …

ఆశలు అనంతమై , శ్వాసలు ప్రశాంతమై మళ్ళి ప్రక్రుతి లోకి వెళ్ళిపోతాయి ….

ఈ మాయ నుంచి అవి విముక్తి పొందుతాయి …..

స్వతంత్రమవుతాయి మళ్ళి బానిసత్వం కోసం దేహాన్ని దాలుస్తాయి ………

ఇది సృష్టి చక్రం ఆగని జగనాథ రధ చక్రం ……..

ఎన్ని హృదయాలు నలిగి పోయిన …

ఎన్ని కెరటాలు తగిలి పోయిన …

చక్రం ఆగేనా ,,,,,,,, తీరం తెగి పోయేనా .....

సహవాసం

సహవాసం
హాసం నీ దరహాసం,
ఆహా ఈ సహవాసం,
వచ్చావు నువ్వు నా కొసం,
పొవొద్దు చెసి నన్ను మొసం,

పలుకుతుంటే నువ్వు ప్రక్రుతి కంత లా,
వెలుగుజిమ్ముతు దివ్య కంతి లా,
వెలుగు నెంపుతు నాలొ ఇంతలా,
వెల్లిపోకు చెజారి బంతి లా,

స్పందననొసగిన నీ సుందర నయనం,
స్పందించిన నా సున్నిత హౄదయం,
సుడి గలుల్లొ సాగర పయనం,
తొడుండాలి నీ సహవాసం,

హాసం నీ దరహాసం,
ఆహా ఈ సహవాసం,

కన్నయ్య పాదాల సాక్షిగా

కన్నయ్య పాదాల సాక్షిగా , నీ పాదాలు నా గుండెల్లో పరిగెడుతున్నాయి,

హృదయం అంగడినంతా నీ పాదముద్రలతో నిమ్పెస్తున్నాయి ,

అవి అలికిన అందమైన రంగుల ముగ్గులు నా జీవితమంతా రంగుల మయం చేస్తున్నాయి,

చూపు తిప్పుకుందామంటే కనుచూపు మేరలో ఆ రంగులే కనబడుతున్నాయి.....

నీ ఉసుల్లో బ్రతికేస్తున్నా

ఊహాలోకం - ఆపిన శోకం ,

ఊపిరి పోసిన నీ ప్రతిరూపం ,

ఉరకలు వేసిన భావప్రపంచం ,

వదిలెల్లదు నన్ను నీతో గడిపిన కాలం ,

వాస్తవమే గతమై పోతూ ,

ఘ్నాపకల నెమరువేత వ్రతమై పోతూ ,

నెమ్మదిగా నిదురిస్తున్న ,

నీ ఉసుల్లో బ్రతికేస్తున్నా

Thursday, April 26, 2012

Comp Connection

once upon a time there was a marketing manager, he lived in... Oh! fuck it!!! apne ishtyle... ek potta tha jisko markeding ka bahut keedaa tha....OOps!!! IINGLISSS!!!

A geek that's what he thinks of himself but in real arrogant, neat freak, smart ASS, who could just do the right things that one can expect from a marketing guy. typical beer mera biryani tera types....

One day he got a jackpot, a job in marketing!! Dude is happy and his doodle hard!!! fantasizing all the possible strategies he should play internally and externally.

First day of his office...

Introduced himself to his peers and got placed at the only left out work station. Who knew that was the most cussed chair to rest your derriere. His asst. comes to him, 'hey so u want me to call u boss or sir, i am comfortable calling you dude!...' this dude is traumatized. Meanwhile, an ugly looking geek comes and starts with an assertive voice in greek and latin about all the IT support he can ask when for required at point any time come room to solution ask..WTF sorry i started talking like Mr. Broker. This IT guy is not comfortable with any language other than his panzy body language. So anyways final our dude got a notebook with a dongle...aamm... along with a dongle to surf. Mr. Broker, 'You naughty do watch porn not in office, cooommmeeee to maayye kyabin'. Oh god NO!! our protagonist is straight.

Enemies are everywhere and this guy found his... lucky bastard! Anyways that's the worn out antique dell laptop(I guess charles babbage time's) with 256mb ram, 40gb hard disc, hey this machine has unique features as well, one of its keys can actually jump....u see this is so useful while your comp is loading, u can actually pastime playing with it. Our philip kotler of the story could hardly realize how big his enemy was... first presentation to the CEO, ppt packed with all the possible strategies with all the innovative revenue models to impress the DOG oops! GOD the CEO, Mr. Pillai. who can be impressed with a tender coconut and a fried machli, awww... so dude in the conference room trying to impress the CEO and the first embarrassment - hero presses the enter key and the shift key jumps up...aa aoo.. its not playtime:( our dear hero apologizing everyone starts with his presentation, the slide gets stuck at the very beginning 'MKTG - Way Forward' and that slide never moved forward. Poor guy!!! from his asst. 'I told you dont use your machine it hardly works, you didn't listen to me! Now see' Asshole is very happy for the screw up and he treated Broker in a gay pub.

Hero throwing tantrums all around enters the IT room, Ovv! ;) tell me what I can do for you?'... "I will break your balls, where's my new laptop?" you know who said this. ‘Yaar I talked to the delly team for the belly oh sorry dell lapy coming week before after they send’ Poor guy too frustrated in life could do nothing than hitting Mr. broker on his shoulder ‘Ouch’

Finally he gets his brand new laptop. ‘take you virgin laptop and say thank you to me’ says Mr. pansy. Dude thought ‘yes I got my new machine now no one can stop me from working! Oh god! I have so much to work…’

Its all fine for the first week and then…

Broker!!! Broker!!! You fucker what the fuck is wrong with you guys whenever I touch it, it turns off! WTFFFF!!!! . ‘Oh! You touch and it turns off OMG how orgasmic are u…!’ Mr. pansy in his style. Dude fix it today or I will give you multiple orgasms in life’ Mr. Marketer. Broker comes back saying everything is fixed. Dude reaches home start working as he has lot of pending work. Seeing this, his dear wife brings him a coffee, taking the coffee in one hand and he takes the laptop in other to realize windows is shutting down…

15 days of work is stuck shuffling between standby Dell >HP> Compaq>, had to depend on his jack ass asst. for everything. Dude is disgusted and work deprived by now. ‘Here is your laaapy I fix everywhere you see not stop atall’ says Mr. Broker putting the machine on the desk. Dude touches the machine to test and the machine turns offfff!!!

All the techies behind it and non could solve. Dude had to take the machine back from them do his own R & D on comps…

Finally a solution…. The machine turns off only when the charger is connected so dude had to use the machine only once charger is removed.

Eureekaaaa!!!!!! Dude ran to the IT room and discussed the whole research… ignoring that Mr. Pillai was in the IT Room.

And our protagonist was promoted as the Head of the dept. IT, since then he is called “THE JAFFA”

Thursday, April 19, 2012

రుద్రం

రుద్రం ఇది రుద్రం ...
ఏ క్షుద్రం కాదు భద్రం!
రగిలిన అగ్గి ప్రళయం,
ఇక ఆగదు ఈ విలయం!
సమయం ఈ సమయం,
ఇది సమరానికి శంఖం!
అంతం ఇది అంతం,
ప్రతి పంతం ఇక అంతం!!!

కావ్య కన్య కోరినదీ మార్పు!

కామించాలేనింక ఎ కన్నేనిక నేను, కరిగిపోయే నా తృష్ణ నీ కౌగిల్లలోన
మొహించాలేనింక మాయనేరిగితి నేను మాసిపోయే నాలోని మొహమంతా,
పడతి నేర్పిన పాఠమిది, ప్రగతికై కట్టిన వారధి,
పయనమైనది నా మది, ప్రక్రుతెరుగానిదీ విధి!
ఆశలకు ఇక చావు ఆశయాలకు జన్మ నాకు ఇచ్చిన దానవమ్మ నువ్వు!
అలుపు చెరిపిన ఓదార్పు, ఆగిపోయను నిట్టూర్పు,
కదలసాగిన కాలము తీర్పు, నా కావ్య కన్య కోరినదీ మార్పు!
అనంతమంతా అల్పమైనది ఇంకా చూపు కలిపాక నాతో నెలవంక!
చైతన్యమోసగిన చేక్షువులు చూశాక, భ్రమ లోన బ్రతకలేనింక బ్రహ్మ సాక్షాత్కారం జరిగినక!

Tuesday, January 31, 2012

ఈ క్షణమే నీ ఒడిలో

ఈ క్షణమే నీ ఒడిలో
ఆనందపు ఈ గుడిలో
చెంప జారిన చెమ్మ నీ చేతి పారాణి చెరుపుతుంటే
చూపు చెరుపుతూ చురుక్కుమన్న తేమ పొరనే తరుముకుంటు
కంటి రెప్పలు కలుసుకుంటే
కమ్ముకొచ్చిన కటిక చీకటి చాటునే నే రమిస్తున్నా
మల్లె మూరను నలుపుతూ నా మెడను చుట్టిన నీ చేతి వేళ్ళ పారాణి నా మెడను ముద్దాడుతుంటే
కాలమాగిందా? నా కోర్కె తీరిందా?
కౌగిళ్ళలో వెచ్చని తడి సెగలు రేపిన స్వేదమల్లె మనని కలిపే నెత్తురే నా స్వాసనాపెస్తుండగా...!
నన్ను కోరిన నీ కన్నీటి చుక్కలు నా నుదుటి తిలకం చెరుపుతుంటే...!
ఆ నీటితో నే రమిస్తుంటే!

కన్యగా నిన్నే చేరుకున్న
నీ చేతి స్పర్సతో కన్నెతనం కోల్పోతున్నా
నీ చూపుతో చూపు కలిపి బ్రతికే వున్నా
కలలు కన్న నూరేళ్ళ కాపురం ఈ ఒక్క క్షణంలో బ్రతికేస్తున్న

బాధపడకు ! బెంగపడకు !
నీ కౌగిలింతే నా ఆశ కడకు !

Thursday, January 12, 2012

జ్ఞాపకాలు దాచుకున్న హార్డ్ డిస్క్ ఎవరో దొంగిలించారు

నాన్న నాకు కొనిపెట్టిన పెప్పేర్మింట్ తియ్యదనాన్ని నేను నాన్నని అయిన తరువాత తనివితీరా చప్పలిద్దామని దాచుకున్న
అమ్మ పెట్టిన గోరుముద్దలతో తీరిన ఆకలి ఇచ్చిన తృప్తిని ఆకలేసిన ప్రతిఒక్కరికి పంచిపెట్టాలని పదిలంగా దాచుకున్న
స్కూల్ కి వెళ్ళే మొదటిరోజు అమ్మకేసి చూస్తూ కార్చిన కన్నీరు ఇంకెవ్వరు చూడకుండా దాచుకున్న
నాది నీది అది ఇది అని వేరు చెయ్యడం నేర్చుకున్న, నాది కూడా నువ్వు తీసుకో అని కలుపుకోవడం తెలుసుకున్న
ఎదిగేకొద్దీ ఎన్నో అనుభవాలు బ్లాకు బోర్డు ఫై గురుతులు ఎన్నో చెరిపేస్తున్నా కొన్ని గురుతుల మరకలు గుండెల్లో చెరగని రంగులు పులిమేసి పోయాయి
అవి కూడా జాగ్రత్త గా దాచుకున్న
కష్టమనిపించినప్పుడు గుండెను కాల్చేసిన కసి సెగలో వెచ్చదనాన్ని నెత్తురు చల్లారిన ప్రతిసారి కచుకుందామని దాచుకున్న
ఆనందానికి సంతోషానికి తేడాతెలియని రోజుల్లో అల్లరికి ఆపదకి అదుపెరుగని అడుగుల్లో అమాయకత్వపు ఆశ్చర్యాలెన్నోఆత్రంగా దాచుకున్న
మనసడిగిన మనుషుల మోముపైని నవ్వుల ముత్యలెన్నో దొంగతనంగా పోగేసి దాచుకున్న
మనసిచ్చి వాళ్ళపై పొందిన అధికారం ఇచ్చిన అహంకారాన్ని ఆస్తనుకొని అనుభూతులు ఎన్నో నాలోనే దాచుకున్న
సాధించిన విజయాలే సరిపోవని సంతరుప్తిని ప్రత్యెక గదిలో నిర్డ్కశాన్యంగా దాచుకున్న
ఎదిగే కొద్ది స్వార్ధం పెరిగి మానవత్వానికి యవత్జీవ ఖైదు విధించి ఇంకెక్కడో నాకే గుర్తు తెలియని చోట చాల లోతు లో దాచుకున్న
ఏది పోగొట్టుకోకుడదని ప్రతిది పరేసుకోకుండా దాచుకున్న
ఇంకెవ్వరికీ దొరకకుండా దాచుకున్న
ఎవరో ఒచ్చి అంతా మాయ అని నన్ను మాయ చేసి అన్నీ దోచుకు పోయి పైగా ఇవి నా దగ్గర దాచుకున్తనంటు దొంగిలించి పోయాడు
ఎంత వెతికినా దొరకటం లేదు, ఎదురుచూస్తున్నా తిరిగి రావటం లేదు
ఎవరినడిగిన అతనో గజ దొంగ మాటలు చెప్పి మోసం చేస్తాడంటున్నారు
పాపం అందరు అతని దోపిడీ కి బలి అయ్యిన వారె
అతని పేరు కాలం అంట !!!!