Friday, October 26, 2012

ఒంటరితనం ఒక అందమైన తీరం !!!





ఒంటరితనం ఒక అందమైన తీరం 
తెల్లారని ఏకాంతం నల్లని చీరను కట్టిన మోహిని అవతారం 
వెలకట్టలేని భావాలను తులనాడలేని  బంధాలను పోగేసి చేసిన  ఇసుక  తిన్నెల పర్వత రూపం 
జ్ఞాపకాలనే కెరటాల తాకిడి, అనుభవాలనే తడి, 
ఆవేదన అనే నురుగు, ఆలోచన ధ్వని!
మెరిసే తారలు మిగిలిన మిత్రులు 
చమక్కుల పలకరింపులు గుర్తుచేసిన జ్ఞాపకాలు 
అదిగో మల్లి తగిలిన కెరటాలు 

ఒంటరితనం ఒక అందమైన తీరం !!!

భయమేమో బతుకు సత్యం అని నేర్పిన గురువు ఏకాంతం 
ప్రేమల పిల్ల గాలి పిలిచిన వైనం - గమ్యం సూన్యమని లాగేసిన ఇసుక సైన్యం 

ఒంటరితనం ఒక అందమైన తీరం !!!

బాధ కన్నా బాధ్యతగల భావం ఇంకోటి లేదు 
బాధ లో పుట్టేదే భావోద్వేగం 
భావుకతలో జన్మనెత్తేదే  భావ కవిత్వం !!!

ఒంటరితనం ఒక అందమైన తీరం !!!

Saturday, October 20, 2012

మరువాన మైదానం


మూతపడిన ముల్లోకాలు, మోతలాపని మన శోకాలు!!!
ఎన్నో ప్రశ్నలకి జన్మనిస్తున్న! సమాధానాలు అన్వేషిస్తున్న! 
అలసి అలసి ఆగిపోతున్న ఆశ బతకాలని తాగిపోతున్న 

మరువాన మరువాన మరువాన మరువాన....
నాతో  నేను - నాలో నేను - నాకై నేను - నన్నే నేను
రమిస్తూ - శ్రమిస్తూ - తపిస్తూ - శపిస్తున్న!
అర్ధాలు వెతకాలని తాగేస్తున్నా  

మరువాన మరువాన మరువాన మరువాన....

దిక్కులు చూపని ఆ దిక్కు వెలుతురూ ఎరుగని ఆ తళ్ళుక్కు 
వెతకని చోటే లేకుండా నే వెతికేస్తున్న 
సమాధానం దొరకలేదనే నే తాగుతున్న  
మరువాన!

ప్రకృతిని, పక్షులని, పనిమాల పలకరిస్తున్న 
పలకలెదని అలిగి కూర్చున్న 
అంద్దుకే నే తాగుతున్న 
మరువాన!

పాతాళం కన్నా లోతంట!
ఆకాశం దాటినా అందడంట!!
అది ఏంటో వెతుకుతున్న 
తెలుస్తుందేమో అని కాలుస్తున్న!!!
అందుకే నే పీలుస్తున్న!!!


ఒక్క సారి ప్రశాంతంగా ఏకాంతంలో కలుసుకుందాం

ఒక్క సారి ప్రశాంతంగా ఏకాంతంలో కలుసుకుందాం 

బంధాలు బాధ్యతల బట్టలు తీసి, అందాలూ ఆనందాల దుప్పటి లో  జారుకుందాం  
ఆశలు ఆవేశాల అగరుపోగాలు, శ్వాసలు స్వేదాల మేళనం లో ముగ్ధమవ్వ్దాం 
కట్టుబాట్ల శరీరాలు కట్టెలో కాల్చి 
ఆరని ఆ అగ్నికి ఆవిరైన ఆత్మా ఆదర్శాన్ని,  మన స్వాతంత్ర్యాన్ని ఆ కొన్ని క్షణాలు ఆనందిద్దాం 

ఒక్క సారి ప్రశాంతంగా ఏకాంతంలో కలుసుకుందాం 


Thursday, October 18, 2012

Neecham


  • రమ్మన్న రాని రేపుకు  దూరపు చుట్టం నిట్టుర్పు 

  • దేహం దాహం తీర్చిన తీర్ధం ఆత్మాను ఆకలికోదిలిన వైనం
  •  
  • చైతన్యం చలరేగితే సూన్యం 

  • చల్లారిన నెత్తుటిలో కలిసిన స్వేదం 
  •  
  • విలువలు అన్ని వలువలు కాగ వ్యక్తిత్వం ఒక వేషం అవగా 

  • వ్యర్ధం నిస్వార్ధం వెనకటి మాటే ఆశావాదం

  • నీచం నీచం దానికన్నా నీచం కింద ఇంకా నీచం ఆ కింద నీచం ఇంకొంచం నీచం 

  • నిచ్చన వేసుకు దిగజారిన మానుషం