Friday, December 28, 2012

నేటి సంఘంలో నువ్వు

పూలదారులు మరిచిపోయిన బాటసారి ని దారి యేది? 

బరువు బరువనుకోనేడి బ్రతుకు పరుగులో నీ స్తనమేది? 

విర్రవీగిన వెర్రి మనుషుల పిచ్చికేకలకర్ధమై నేటి సంఘం నిలువగా అందులో ని పాత్ర ఏది? 

పశువు మేలయ నీతో పోల్చితే పచ్చికే పరమార్ధము 

నీకు వాంఛల వెల్లువమ్మొ నిలువాదే మది నిమిషము 

నిన్న నీచము నీకు ఆ పని నేడు నీకది ధర్మమా?

పద్దతులు పదివేలు ఉన్నవి రోజుకొక్కటి సొంతమ?

ఏమిటో ఈ వైపరీత్యం ! విరుగుడే మరి వెతకవు 

సంస్థలెన్నో పుట్టుకొచ్చే ఇవి పురోగాతులని పలుకుతూ 

సంస్కృతేమొ సగము చచ్చే తనకు స్తనం వెతుకుతూ !

Thursday, December 13, 2012

వెలుగే కొత్తగా వాళ్ళో వాలగా వెలిగిందీక్షణం వెలుతురు సాక్షిగా

వెలుగే కొత్తగా వాళ్ళో వాలగా వెలిగిందీక్షణం వెలుతురు సాక్షిగా 
కలలే ఇంతగా కాననే లేదుగా నీ కౌగిలి పరిచయం ఓ కమ్మని పరిమళం 

పెదవుల వెనకే పలుకే ఆగె 
పదే పదే నీకై మనసే లాగె 
కల నిజమయ్యింద కధ మొదలయ్యింద 
కలిసిన మనసుల కధ కనులకు తెలిసిందా 

వెలుగే కొత్తగా వాళ్ళో వాలగా వెలిగిందీక్షణం వెలుతురు సాక్షిగా 
కలలే ఇంతగా కాననే లేదుగా నీ కౌగిలి పరిచయం ఓ కమ్మని పరిమళం 

ఉందొ లేదో నికే ప్రేమే మదిలో 
సవ్వడి నువ్వయ్యవే న హృది లో  యద లో 
నమ్మాలో లేదు నిన్ను అని నమ్మకమదిగితే నన్ను ఏమనను 
నమ్మకమే ఒదిలిన నిన్ను నిత్యం నీతో ఉంటాను నిన్ను ఒదిలి పోను 

వెలుగే కొత్తగా వాళ్ళో వాలగా వెలిగిందీక్షణం వెలుతురు సాక్షిగా 
కలలే ఇంతగా కాననే లేదుగా నీ కౌగిలి పరిచయం ఓ కమ్మని పరిమళం