ఒంటరితనం ఒక అందమైన తీరం
తెల్లారని ఏకాంతం నల్లని చీరను కట్టిన మోహిని అవతారం
వెలకట్టలేని భావాలను తులనాడలేని బంధాలను పోగేసి చేసిన ఇసుక తిన్నెల పర్వత రూపం
జ్ఞాపకాలనే కెరటాల తాకిడి, అనుభవాలనే తడి,
మెరిసే తారలు మిగిలిన మిత్రులు
చమక్కుల పలకరింపులు గుర్తుచేసిన జ్ఞాపకాలు
అదిగో మల్లి తగిలిన కెరటాలు
ఒంటరితనం ఒక అందమైన తీరం !!!
భయమేమో బతుకు సత్యం అని నేర్పిన గురువు ఏకాంతం
ప్రేమల పిల్ల గాలి పిలిచిన వైనం - గమ్యం సూన్యమని లాగేసిన ఇసుక సైన్యం
ఒంటరితనం ఒక అందమైన తీరం !!!
బాధ కన్నా బాధ్యతగల భావం ఇంకోటి లేదు
బాధ లో పుట్టేదే భావోద్వేగం
భావుకతలో జన్మనెత్తేదే భావ కవిత్వం !!!
ఒంటరితనం ఒక అందమైన తీరం !!!
No comments:
Post a Comment