నింగికెగసిన మేఘమే తన మెరుపు సొగసుల చూసి మురిసే,
ఎగసె ఎగసెనది ఆకాశవీధి వైపుగా వాయు వేగము మైత్రి తోడై,
విర్రవీగేను ధరణినే అది వెక్కిరిస్తు, శిధిలమైన జడము భూమని మదము చూపెను ఉరిమి ఉరిమి,
గర్వరాధమే పధము చేర్చునో అది గమనించలేదు అజ్ఞాన నిశితో సంగమొంది,
పదే పదే అది పరుగులెత్తే ప్రజలు చేసెరి ఇక ప్రభువు తనని,
దిక్కులన్నీ న చేత చిక్కినంచు చెనకలేరానె చేవతో చెలరేగసాగే,
పోయె పోయె ఉత్తరానికి ఉత్తి పుణ్యానికి పిడుగుల ప్రగల్భాలు ప్రకటించసాగె,
వేగమన్నది కాలమని, మెరుపులా మైత్రి క్షణ కాలమని మరిచె మేఘం మంద బుద్ధి తో,
స్థిరమై, సుస్థిరమై,సకల జీవుల స్థలమై, శీతలమై, అచంచలమై, ,అజేయమై, మహాచలమై, పృథ్వి పర్వత రూపమొందే,
ఆగక అది పాఠము చెప్పెద ధాత్రికి గుణపాఠము చెప్పేదానిని గజమై ధ్వజమెత్త సాగెను ఆవేశము తో,
వాయువు తన మైత్రి ఒదిలి, మెరుపులు మధింప మొదలే,
ఢీకొనే ధీరుని డం డం ధ్వనులిక డాంబించ సాగే,
తన స్వభావమే భారమై, నీరుగారె మేఘము అస్తిత్వము కరిగిపోయి,
బంధాలేవైనా అందములే గాని అవి శాశ్వత సంబంధములు కాజాలవు నిజము నవీన!
No comments:
Post a Comment