Saturday, May 12, 2018

రాముడె రావణుఁడైపోయె


విపత్తి సంపత్తిగా వెంట వచ్చినగాని,
ఆపత్తులు ఆయనను వీడకున్న గాని,
వంకలెన్కని ధర్మమొదలని ధర్మప్రభువు,
ఆయన
కామ విజేత, క్రోధత్యజిత, లోభ రహిత, స్వయంసమ్మోహనాకృత, మద మాత్సర్య నాశనకర్త!
మరి రుద్రుడాయెనే మిత్ర ప్రాణోత్సహము చేత?
అది భీకర భీభత్స రణ రోదన,
ఒకే మాట, ఒకే బాణం అందరికి ఒకే ధర్మం అయన విధానం,
ఒదలనే ఒదిలె ఆ ఒక్క బాణం!
'అధార్మి! ఆగ'మనె అప్పుడు ఆజన్మగర్వి,
క్షణమాగక ఛేదించే అస్త్రమతడు అసువులుబాసె

నీలి మేఘమాలా తేర తెరచి నన్ను చుసె  సూర్యనారాయను రీతి నీలమేఘశ్యాముడు కలువ రేకుల కనురెప్పలెత్తి నింగి చుసె,
ధర్మానికి ధర్మము పై అనుమానమా అని అందరి లోని అధర్మము అబ్బురపోయి చూసె,
రావణ సంహారి, లోకకల్యాణ కారి చేసేనిక అవతారసమాప్తి...

ఏడవ విష్ణువు ఏడు గుమ్మాల ఎదుట నిలిచె,
ఎవ్వరు పొందని పుణ్యము పొందె పృథ్వి ప్రాణులు,
ఉడతలు కూడా తాకెనీ బ్రహ్మ పాదములు,
"విష్ణుమాయయే  విశ్వమంతను కానీ, రాముడే లే సృష్టి సత్యము",
అని అవతార సారము జుర్రుకునెనక్కడి సకల చెరాచేరము,
వెకిలి ఒకడక్కడ విరగబడి నవ్వె వీరందరిది వెర్రి అనుచు,
గుసగుసల రుసరుసలు రగిలె అందరిలో అతగాడి పూర్వజన్మ వాసనల పై నొసలు చిట్లించుచు,
రావణుడు చచ్చిన వాడి గుణములు చావలేదింకా ఈ జయుడు ఒక్కనాటికి మారునా అనుకోనె అందరు మంటతొ,
వజ్రాల రాళ్లు రాముడి పాదముల నొచ్చునని వాటిని కప్పేందుకు రాళ్లపై రాలె వైకుంఠ వాటిక కుసుమాలు,
పాదముమోపబోయే పద్మనాభి పాలసంద్రము గడప వైపు,
ఆగు ఆగని ఆ జయుడు ఆత్మజ్ఞానం జయించని వాడు,
రావణుదెన్నడు  దాటరాదీ నిగమ లోకము గుమ్మము,
అవతలకు పో పొమ్మనె  నెంత మాత్రము ఎరుక లేక,
ఆగెనక్కడె అనంతనాధుడు సత్చిదానందుడై,
అధర్మమునాశ్రయించి అక్రమ హత్యకు పాల్పడిన నువ్వు రావణుడవు గాక మరి ఎవ్వరు అని అడిగె  జయుడు,
నిజమే నేనే రావణుడను, నేనే ధర్మాధర్మాలు, నేనే నీవు కూడా...
రావణుడు - 'ఈ విష్ణు భటుడిపైనా ని విష్ణు మాయ, చెల్లదు, చెల్లారదు, నే చెల్లనివ్వను నువ్వు వెళ్లబోవు' ....
రాముడు - 'విన్నంత మాత్రాన వైరాగ్యము, చూసినంత మాత్రాన చైతన్యము, అడిగినంత మాత్రాన మోక్షం అందబోవు'
రావణుడు - 'విన్నంత వేదాంతము వల్లించుట నీకె చెల్లు, వంకలింక చెల్లవింక ఇది కాదు లంక నీ ఆటలు సాగవింక ధర్మమొక్కటి చెప్పు ని అసలు వర్ణము చూపు'...
వాలి అంతట వాలె వదరరాదని జయుని వారించజాలె,
"వానరుడు నేను రాజపుంగవుడు రాముడు వేట వారి ధర్మము, జంతుజన్మ నా నిజాము,
ధర్మమాయన అనుసరించెడిది కాదు, ధర్మమాయనను అనుసరించునది,
నాల్గు పాదాల నడుచు ధర్మధేనువు ఆయనింటి కాడి పశువు" అని వాలి అడ్డుతొలగమనె ఆవేశము తొ,

అంతటాగని అవివేకి  అడిగేనిపుడు,

"కానలకేతెంచె ఒకపరి మాయమ్మ కనకధారాల లక్ష్మి కటిక దరిద్రము చుసెనితగాడి కన్న జనకుని కోరిక మేర, 
అగ్ని చెప్పిన నమ్మని అనుమాన రోగి తాగి వాగిన చాకలి వంక చెప్పి, తమ్ముడను తోడిచ్చి తోలె తల్లిని తొఱ్ఱల పాల్జేసె,
తొలి చూరు కడుపు కానరాకనో కానలకు పంపె కల్పవల్లిని, అవ్వ!
రావణుడైన ఎన్నడు చెయ్యదీపని. రాముడంచు, ధర్మసోముడనుచు, సకలగుణాభిరాముడంచు... అవునులే సకలంబులయందు దుర్గుణములు కూడ కూడు కదా సూక్ష్మంబు నేనెట్ల మరచి... ఛి..ఛి!!!
రాముడిగాపుట్టి రావణు చంపెననుకొంటు తానె రావణుఁడైపోయె ఛి .. ఛి ... "

అంతట హటాత్తుగా కంపించె వైకుంఠమిది ఎన్నడూ జరగని చిత్రము,
వెలుగు పోయె కారుచీకట్లు విరియసాగె వైకుంఠమున రాముడొక్కడు  వెలిగె ప్రణవ ప్రకాశిగా,
అదిరినన్నియు ఆది లక్ష్మి ఆగ్రహానికి, ఐశ్వర్యములు కూడ బెదిరి రాముని పాదధూళి వెనుకదాగె,
పద్నాల్గు భువనముల ప్రాణభీతి, పరుగులెత్తె ప్రాణికోటి పద్మనాభుని పాదములకై,

"బుద్ధి శుద్ధి లేని ఏ సిద్ది ఎందుకు? బ్రహ్మపదవులెందుకు?
రామ నామమొక్కటె రమ్యమని ఎరుగక   వేదములన్ని వల్లించె వాక్కు ఎందులకు?
పది తలల తిమ్మిరి పొట్టపగిలిన పోక పిచ్చివాగుడు వాగు పైత్యి యెవ్వడాడు?
శునకమొక్కటి మదమునొంది ప్రభువునే చూసి మొరిగేనంట,
సంహరించెద వాడ్ని నేడు, వాక్కు ఉండబోదింకెవ్వానికి, శక్తి ఉపసంహరింతునిపుడు సృష్టినాపివేతు",
ఆది లక్ష్మి ఇంక ఆది శక్తి గ మారుతుంటె ఆపెనపుడు మన తండ్రి ఆది నారాయణుడు,

రాముడు - "ఆగ్రహమొక్కనాటికి నీకివ్వదు ఆత్మా తృప్తి,
ఆత్రమెన్నటికి తేబోదు ఆత్మా శాంతి, 
జయ ఏ మాయ లేకుండుటే విష్ణు మాయ"

లక్ష్మి - "ఒక్కనాటికి శాంతి కోల్పోని స్థిత ప్రజ్ఞ రామచంద్ర మూర్తి, రజోగుణ సంపత్తి చేత లేని విపత్తుల పాలవువాడె రావణుడు,
రాముడెన్నటికి రావణుడు కాబోడు! ధర్మమూ ఎన్నటికి అర్ధరహితము కాబోదు!

కనువిప్పు జయునకే కాదు జనములందరికి,
సత్యమిది సత్యయుగము ముందు నుండి!
ధర్మో రక్షతి రక్షితః !
















No comments: