Saturday, September 30, 2017

ఆనంద విలాసము...

రెచ్చిపోయిన కణిక రగలగా రగలగా, 
రాపిడుల రవమయ్యి చెలరేగే ప్రణవము,
సృష్టి  బ్రహ్మాండములు పుట్టె ,
సుముహూర్తాలు చూడక జతలు కట్టె,
గతులు మారి పతులు పుట్టె ,
బతక తలంచి వాంఛ పుట్టె ,
చావెరుగని చేవతోడ చెరులు సంచరించె ,
కవ్వించగా కాలము నిగూడమయ్యి జ్ఞానము,
జగములుద్భవించెనిదియని ఆనంద విలాసము... 

స్వగర్వ భ్రమణమొంది పరము మాని ప్రగల్భముల పాలాయె ప్రభల వలన,
ధాతు భూతముల భజన తోడ భ్రమలు కూడి బ్రహ్మ తాననె  బంతులన్నీ,
పుట్టె  ప్రాణి కోటి నిమ్నమే నిజమని నిగమమెరుగనిదై,
అవతరించెను భ్రాంతి - ఆత్మనెరుగని ఆర్తి,
సాక్షి కాలము - కాదాయనుకొనెనిది అజ్ఞాన అవివేకముల పరిహాసము, 
ఈ ఆనంద విలాసము... 

ఆగలేదంతట 'ఈ గో'లలాట, 
మించి మంచి మహతులెంచి,
సృజనలావహించి పెంచి పోషించ సాగె ప్రభులమంచు,
వెలుగు జిలుగుల గోళముల కటికచీకటి కాంచి క్రోధమాగని కాలము కదలసాగె,
గతము పుట్టె స్వగతము గ్రహముల చుట్టబట్టె,
చరులకు ఇక చరిత్ర పుట్టె జ్ఞాపకాల జాడబట్టె,
కాలమేతెంచె నిక అని కాలము కాలాతీతుని కాళ్ళు బట్టె,
చూడలేకున్నాను నిన్ను తెలియని జగముల పై జాలినొందలేకున్నాను,
నీ  ప్రేరణ లేని సృష్టి సృష్టి కాదే , ని మన్నన లేని తృప్తి తృప్తి కాదే, కాడలేని గొప్ప నీదే, 
మాకును ఒకపరి దరిశనమియ్యరాదే ఆని వేడుకొనె కాలము, 
సత్యము అది స్వచ్ఛము అది నిగమము అది ప్రణవము,
ఇది మొదలు అసలు ఆనంద విలాసము...  
'గొప్పలకుబోయె గర్వగ్రాహులు ఈ గురుత్వగ్రహములు,
గొప్పజెప్పవయ్యా నీ గుట్టు విప్పవయ్య,
నిన్ను నీకు నువ్వు చూపవయ్య'.  
'కోరికలెరుగని నీకేలకలిగెనింత చింత,
పాలపుంతల మధ్యనున్నది ఒక మంచి ముంత,
సృజనకు నిత్తు స్వేచ్ఛ కాంత, పుట్టుగాక జీవి భవము చేత,
మనంబునొంది యుండు వాడు మనుజుడదిగో,
ఏ రాజ తాండవము సృజన చేశెనో బ్రాహ్మాండము,
ఆ రాజు సంకల్పమీ ఆనంద విలాసము...

Ananda Thandavam to be continued...