Tuesday, January 31, 2012

ఈ క్షణమే నీ ఒడిలో

ఈ క్షణమే నీ ఒడిలో
ఆనందపు ఈ గుడిలో
చెంప జారిన చెమ్మ నీ చేతి పారాణి చెరుపుతుంటే
చూపు చెరుపుతూ చురుక్కుమన్న తేమ పొరనే తరుముకుంటు
కంటి రెప్పలు కలుసుకుంటే
కమ్ముకొచ్చిన కటిక చీకటి చాటునే నే రమిస్తున్నా
మల్లె మూరను నలుపుతూ నా మెడను చుట్టిన నీ చేతి వేళ్ళ పారాణి నా మెడను ముద్దాడుతుంటే
కాలమాగిందా? నా కోర్కె తీరిందా?
కౌగిళ్ళలో వెచ్చని తడి సెగలు రేపిన స్వేదమల్లె మనని కలిపే నెత్తురే నా స్వాసనాపెస్తుండగా...!
నన్ను కోరిన నీ కన్నీటి చుక్కలు నా నుదుటి తిలకం చెరుపుతుంటే...!
ఆ నీటితో నే రమిస్తుంటే!

కన్యగా నిన్నే చేరుకున్న
నీ చేతి స్పర్సతో కన్నెతనం కోల్పోతున్నా
నీ చూపుతో చూపు కలిపి బ్రతికే వున్నా
కలలు కన్న నూరేళ్ళ కాపురం ఈ ఒక్క క్షణంలో బ్రతికేస్తున్న

బాధపడకు ! బెంగపడకు !
నీ కౌగిలింతే నా ఆశ కడకు !

Thursday, January 12, 2012

జ్ఞాపకాలు దాచుకున్న హార్డ్ డిస్క్ ఎవరో దొంగిలించారు

నాన్న నాకు కొనిపెట్టిన పెప్పేర్మింట్ తియ్యదనాన్ని నేను నాన్నని అయిన తరువాత తనివితీరా చప్పలిద్దామని దాచుకున్న
అమ్మ పెట్టిన గోరుముద్దలతో తీరిన ఆకలి ఇచ్చిన తృప్తిని ఆకలేసిన ప్రతిఒక్కరికి పంచిపెట్టాలని పదిలంగా దాచుకున్న
స్కూల్ కి వెళ్ళే మొదటిరోజు అమ్మకేసి చూస్తూ కార్చిన కన్నీరు ఇంకెవ్వరు చూడకుండా దాచుకున్న
నాది నీది అది ఇది అని వేరు చెయ్యడం నేర్చుకున్న, నాది కూడా నువ్వు తీసుకో అని కలుపుకోవడం తెలుసుకున్న
ఎదిగేకొద్దీ ఎన్నో అనుభవాలు బ్లాకు బోర్డు ఫై గురుతులు ఎన్నో చెరిపేస్తున్నా కొన్ని గురుతుల మరకలు గుండెల్లో చెరగని రంగులు పులిమేసి పోయాయి
అవి కూడా జాగ్రత్త గా దాచుకున్న
కష్టమనిపించినప్పుడు గుండెను కాల్చేసిన కసి సెగలో వెచ్చదనాన్ని నెత్తురు చల్లారిన ప్రతిసారి కచుకుందామని దాచుకున్న
ఆనందానికి సంతోషానికి తేడాతెలియని రోజుల్లో అల్లరికి ఆపదకి అదుపెరుగని అడుగుల్లో అమాయకత్వపు ఆశ్చర్యాలెన్నోఆత్రంగా దాచుకున్న
మనసడిగిన మనుషుల మోముపైని నవ్వుల ముత్యలెన్నో దొంగతనంగా పోగేసి దాచుకున్న
మనసిచ్చి వాళ్ళపై పొందిన అధికారం ఇచ్చిన అహంకారాన్ని ఆస్తనుకొని అనుభూతులు ఎన్నో నాలోనే దాచుకున్న
సాధించిన విజయాలే సరిపోవని సంతరుప్తిని ప్రత్యెక గదిలో నిర్డ్కశాన్యంగా దాచుకున్న
ఎదిగే కొద్ది స్వార్ధం పెరిగి మానవత్వానికి యవత్జీవ ఖైదు విధించి ఇంకెక్కడో నాకే గుర్తు తెలియని చోట చాల లోతు లో దాచుకున్న
ఏది పోగొట్టుకోకుడదని ప్రతిది పరేసుకోకుండా దాచుకున్న
ఇంకెవ్వరికీ దొరకకుండా దాచుకున్న
ఎవరో ఒచ్చి అంతా మాయ అని నన్ను మాయ చేసి అన్నీ దోచుకు పోయి పైగా ఇవి నా దగ్గర దాచుకున్తనంటు దొంగిలించి పోయాడు
ఎంత వెతికినా దొరకటం లేదు, ఎదురుచూస్తున్నా తిరిగి రావటం లేదు
ఎవరినడిగిన అతనో గజ దొంగ మాటలు చెప్పి మోసం చేస్తాడంటున్నారు
పాపం అందరు అతని దోపిడీ కి బలి అయ్యిన వారె
అతని పేరు కాలం అంట !!!!