Tuesday, January 31, 2012

ఈ క్షణమే నీ ఒడిలో

ఈ క్షణమే నీ ఒడిలో
ఆనందపు ఈ గుడిలో
చెంప జారిన చెమ్మ నీ చేతి పారాణి చెరుపుతుంటే
చూపు చెరుపుతూ చురుక్కుమన్న తేమ పొరనే తరుముకుంటు
కంటి రెప్పలు కలుసుకుంటే
కమ్ముకొచ్చిన కటిక చీకటి చాటునే నే రమిస్తున్నా
మల్లె మూరను నలుపుతూ నా మెడను చుట్టిన నీ చేతి వేళ్ళ పారాణి నా మెడను ముద్దాడుతుంటే
కాలమాగిందా? నా కోర్కె తీరిందా?
కౌగిళ్ళలో వెచ్చని తడి సెగలు రేపిన స్వేదమల్లె మనని కలిపే నెత్తురే నా స్వాసనాపెస్తుండగా...!
నన్ను కోరిన నీ కన్నీటి చుక్కలు నా నుదుటి తిలకం చెరుపుతుంటే...!
ఆ నీటితో నే రమిస్తుంటే!

కన్యగా నిన్నే చేరుకున్న
నీ చేతి స్పర్సతో కన్నెతనం కోల్పోతున్నా
నీ చూపుతో చూపు కలిపి బ్రతికే వున్నా
కలలు కన్న నూరేళ్ళ కాపురం ఈ ఒక్క క్షణంలో బ్రతికేస్తున్న

బాధపడకు ! బెంగపడకు !
నీ కౌగిలింతే నా ఆశ కడకు !

1 comment:

kovela santosh kumar said...

wonder full poetry.. i did'nt expect this type of telugu