Monday, November 5, 2012


మనసుపడిన కాంత కోసం మనసు చేసే నిరీక్షణ 
అర్ధం అవదావనితకేమో ఆశ లో ఆవేదన 

భావాలకు కళ్ళెం వేసి పరుగాపితే ప్రియతమా 
అది ఆగి అరిచే ఆస్వామ ? ని ఆశ అంతటి అల్పమా ?
ఆపగ అది ఆపగ ఆగదు, ఆశ  అన్నది వివేకమేరుగదు 

శీలమన్నది సొత్తు కాదు - సిగ్గు అలమర దాచలేదు 
సమర్పణ అనే అగరుపోగల సువసనే శీలము 
సంయోగ భోగ యోగమే విశ్వము 

మనసుకో తాళం, ఆశ కో అవధి , ఆనందానికో ఆనకట్ట , జీవితానికో భగవంతుని రాత !
అనే భ్రమ లో బంధించడానికే  బంధాలనే రోత !
పగలగొడితే మనసు తాళం , దాటిపోతే ఆశ అవధి , కట్ట తెంచిన ఆనందపు వరద తిరగారాస్తాయి జన్మ రాత !

రక్కలు విప్పిన పక్షిని అడుగు స్వతంత్రం అర్ధం ఏంటో !
గర్జించే సింహన్నడుగు తెగింపు తీరం దూరం ఎంతో !

ఆత్మా సాక్షిని ఆర్తిగా అడుగు ఆదర్శం అర్ధం ఏంటో!

No comments: