Friday, May 4, 2018

రాముడు లేని సీతను కలిసె


ఊహల రక్కసి, ఊపిరిలో కసి, యుద్ధం మాత్రమే ఇచ్చును శాంతి,
బానిసలందరి బంధము తెంచి వారికి ప్రభువవ్వాలనే భ్రాంతి,
సులభంగా లభించని జీవికి బలవంతం సులువనిపించి,
విపరీతం వీడి వాటం చూపించి,
చిందరవందర చైతన్యంతో చెలరేగిన రావణ చిత్తం
రాముడు లేని సీతను కలిసె,
అవివేక స్వార్ధం అడిగిందని అతడి ఆత్రం,
ఆమె అందమో, అద్భుతమో కాదు ఆమె ఆదర్శం,
మైత్రి నొందె సీతారావనులిపుడు,
ఆలి చూపెనతగాడి పైన జాలి,
అయ్యెనామె మాట శాసనంబిక పైన,
అంతకంతకు జత కట్టె ఆజన్మ శత్రువులు,
తారుమారాయెనో బ్రహ్మ రాతలిపుడు...
అడగనే అడిగె వాడు ఆమె చేయి,
సీత, తానొక్క రామునిఁదోయి,
నీవు మరి మారి రమ్ము రాము రీతి,
అని చెప్పె సతి,
రావణుడిపుడు రాముని వెదకబోయె కానలవెంట,
కనబడక, వెనుతిరుగ కాళ్ళు రాక కోసి విసిరె తన అస్తిత్వ కవచంప్పుడు,
త్యాగి తెగత్రోసె తన తిమిర తెరను,
అసుర వరగర్వ భంగంబు అతని మార్చె, సుసుర సుగుణ శ్రీ రాముడు అతనిలో సంభవించె,
రాముడతడు ఇపుడు సీత కై యేగె, సంద్రములు దాట సాగె,
చేరెనిపుడు రవాణరాముడు సీత చెంత శోభనాంగుడై,
రాముడనిక నేను నీతో కలిసి ఈ జన్మనెలుతాను, జత చేరు సీత ఈ రావణరాముడు దాటె నీకోసం మితమతుల గీత,
చూసె సీత రావణరాముని ఓరకంట,
రాముడివైనావు కానీ నువ్వు ఇక రావణు కావు,
మాట చెబిటి నే ఆ రావణుకు నువ్వు ఇక అతడు కావు,
రాముడవు నీవైనా రావణుకు నేనిచ్చిన మాటపోవు,
నీ మోహము నాతో మొదలేనేమో కాని అది మురిసే నీలోని రాముని చూసి,
నీలోన రామావిర్భావము కూడ నీ చిత్తం మాయ ఋషి, ఆశ పూసిన మసి ని కళ్ళు గప్పిన నిశి,
నీవు రాముడైతే రాదా సీత ని చెంత? రావాలా నువ్వు నన్ను వెతుక్కుంట?

రాతలెన్నటికి మారవో - ఎంతైన మనిషి మారుట మాయయో !

No comments: