Wednesday, November 29, 2017

సిరి సమస్య

బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము టాననె పాదము,
బ్రహ్మను కన్న పద్మము, పద్మావతి ని పత్నిగా పొందిన దైవము,
పరమపధము ప్రకటించిన జ్ఞానము,
పదము పై పరిశోధనలెరుగక ప్రజల కై పరుగెడుతున్న పాదము,
పవిట చిరు వేలున చిక్కగ చేతననొసగని జ్ఞాన పధము,
సిరి చేతుల వడి చర  చర  జారిన చీరకు నాధుని నైజము,
దుఃఖముల భక్తులకెచటనో రక్షణ కై నాధుడు కదిలెనొ,
శీల శిక్ష పతివ్రతలకు ప్రాప్తమో,
రక్షణకై నాధుడు కదిలెనొ,
మరి సిరి శీలము శ్రీనాధుకు చులకన?
గోవిందా అనే గోవుల గొంతులు విని అరవింద నీ ఆత్రములెరుగన,
ద్రౌపదికిచ్చిన్న చీరల సారెలు - మరచితివా ని పత్ని వలువలు...

No comments: